రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
- అలాగని మరొకరిని కూడా ప్రకటించబోం
- ప్రాంతీయ పార్టీల వల్ల కాంగ్రెస్, బీజేపీ ఓట్లపై ప్రభావం
- ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పేర్కొన్న చిదంబరం గత రెండు దశాబ్దాల్లో ప్రాంతీయ పార్టీలు బాగా పెరిగాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతంపై అవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. భావసారూప్య పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోమంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.