అంతా మోదీ పుణ్యమే.. సీబీఐలో కూడా కుమ్ములాటలు మొదలయ్యాయి: రాహుల్
- మోదీ సన్నిహితుడు రాకేష్ ఆస్థానా లంచం కేసులో ఇరుక్కున్నారు
- సీబీఐ పరువును మోదీ తీసేశారు
- సీబీఐని మోదీ ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు
రాజకీయ కక్ష సాధింపుల కోసం సీబీఐని మోదీ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు. గుజరాత్ కేడర్ అధికారి, గోద్రా సిట్ ఫేమ్, మోదీకి సన్నిహితుడు, సీబీఐలో నెంబర్ టూ అధికారిగా చొరబడిన వ్యక్తి అయిన ఆస్థానా ఇప్పుడు లంచం కేసులో పట్టుబడ్డారని ఎద్దేవా చేశారు. మోదీ సీబీఐ పరువు తీశారని మండిపడ్డారు. ఆస్థానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా నియమించడంపై కాంగ్రెస్ కొన్ని రోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.