తెలంగాణలో స్వైన్ ఫ్లూ టెర్రర్.. ఒక్క నెలలోనే 125 కేసుల నమోదు!
- జాబితాలో ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు
- అధికారుల వివరాలపై గోప్యత పాటిస్తున్న వైద్యులు
- ఇప్పటివరకూ నలుగురు మృతి
తెలంగాణలో ఇప్పటివరకూ ముగ్గురు ఐఏఎస్ అధికారులు, నలుగురు డీఆర్వో, ఆర్డీవో స్థాయి అధికారులు ఉన్నట్లు సమాచారం. అధికారుల పేర్లను బయటపెడితే మళ్లీ విధి నిర్వహణలో ఇబ్బందులు వచ్చే అవకాశమున్నందున గోప్యత పాటిస్తున్నారు.
మరోవైపు ఈ విషయమై గాంధీ ఆసుపత్రి వైద్యుడొకరు స్పందిస్తూ.. గత వారం రోజుల్లో 20 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది 54 మంది ఈ వ్యాధికి చికిత్స పొందగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.