'దేవదాస్' విజయం ఘనత నాగార్జున, నానీలకే చెందుతుంది!: నిర్మాత అశ్వనీదత్
- వారిద్దరి వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది
- ఎన్నో సినిమాలు నిర్మించిన నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం
- అన్ని వర్గాల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది
శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' చిత్రం సక్సెస్ మీట్లో అశ్వనీదత్ మాట్లాడుతూ, తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించినా ఈ చిత్ర విజయం తనలో ఎంతో నమ్మకాన్ని పెంచిందన్నారు. కేవలం లాభాల కోసమే సినిమాలు అనుకోకుండా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలన్న తమ ప్రయత్నం ఫలించినందుకు ఆనందంగా ఉందన్నారు. హీరోలు నాగార్జున, నానీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, వారి వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో నిబడిందని అన్నారు. భూపతి రాజా, సాయిమాధవ్ బుర్రా, సత్యానంద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్లుగా నటించారు.