ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూత.. ఈరోజే ఆయన పుట్టినరోజు కూడా!
- ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తివారీ
- ఆయన వయసు 93 సంవత్సరాలు
- రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన తివారీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తివారీ మూడు పర్యాయాలు పని చేశారు. ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పని చేశారు. 2007 ఆగస్టు 22 నుంచి 2009 డిసెంబర్ 26 వరకు ఏపీ గవర్నర్ గా వ్యవహరించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ పదవిని ఆయన కోల్పోయారు. ఆయన స్థానంలో నరసింహన్ గవర్నర్ గా వచ్చారు.