డెబిట్ కమ్ క్రెడిట్ కార్డు అందించనున్న ఇండస్ఇండ్ బ్యాంక్
- ఒకే కార్డుతో రెండు అవసరాలు తీర్చుకునే అవకాశం
- వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలంటున్న యాజమాన్యం
- ఖాతాదారులకు సౌలభ్యమైన సేవలే లక్ష్యమని ప్రకటన
ఖాతాదారులకు సౌకర్యవంతమైన సేవలందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనివల్ల ఖాతాదారుడు రెండింటినీ వేర్వేరుగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని, ఒకే సమాచారాన్ని సేవ్ చేసుకుని వాడుకోవచ్చని చెబుతోంది. ఈ కార్డులో రెండు మాగ్నటిక్ స్ట్రిప్స్, రెండు ఈవీఎం చిప్స్ ఉంటాయి. డ్యూ కార్డు లాంటి సేవలు ఖాతాదారుల లావాదేవీలను మరింత సులభతరం చేస్తాయని కస్టమర్ బ్యాంకింగ్ ప్రతినిధి సుమంత్కత్పాలియా తెలిపారు.