మిజోరాంలో వచ్చే క్రిస్మస్ మా అధికారంలోనే: అమిత్ షా ధీమా
- మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం
- ఇక్కడ విజయం సాధిస్తే ఈశాన్యా రాష్ట్రాలన్నీ బీజేపీకే దక్కినట్టవుతుంది
- కేంద్రం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు
ఈశాన్య రాష్ట్రాల్లోని 8 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మిజోరాంలో విజయం సాధిస్తే ఈశాన్యా రాష్ట్రాలన్నీ బీజేపీకి దక్కినట్టే అవుతుందని చెప్పారు. మిజోరాం అభివృద్ధికి తాము కేటాయించిన నిధులను కాంగ్రెస్ పాలకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాగా, ఐజ్వాల్ లో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని నిన్న ఆయన ప్రారంభించారు. ఆర్.డెంగ్తు వామా ఇండరో స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.