బరువు పెరిగితే గౌరవంగా తప్పుకుంటాను: యాంకర్ రష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరువు పెరిగితే గౌరవంగా తప్పుకుంటాను: యాంకర్ రష్మి

  • బరువు పెరిగితే అవకాశాలు పోతాయి
  • చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను 
  • ఆహార నియమాలు పాటిస్తున్నాను
ఒక వైపున యాంకర్ గా బుల్లితెరపై రష్మి సందడి చేస్తూనే, మరో వైపున కథానాయికగా వెండితెరపై తన సత్తా చాటుకుంటోంది. యూత్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ వుంది. తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఆమె టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఒక అభిమాని "ఈ మధ్య ఒక ఈవెంట్ లో చీరలో మీరు చాలా లావుగా కనిపించారు. మీ తోటి వాళ్లంతా చాలా స్లిమ్ గా వుంటున్నారు. మీరు మీ శరీరాకృతిపై దృష్టిపెట్టకపోతే, కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం వుంది" అనే అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

అందుకు రష్మి స్పందిస్తూ .. "నేను బరువు పెరగడానికి కారణం నా నిర్లక్ష్యం కాదు .. 'రుమాటిజం' అనే ఆరోగ్య సమస్య. అందువలన బరువు పెరగడం .. తగ్గడం వంటి హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బరువు పెరగకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆహార నియమాలు పాటిస్తున్నాను. ఈ విషయంలో నియంత్రణ కోల్పోయిన రోజున నేను గౌరవంగా తప్పుకుంటాను" అని సమాధానమిచ్చారు. 
rashmi

More Telugu News