Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే చెన్నైలోనే ఉండిపోయాము: ఎస్.పి. శైలజ

  • రెండు భాషల్లో పాటలు పాడేదానిని 
  • సుధాకర్ తమిళ సీరియల్స్ చేసేవారు 
  • అప్పుడు మా అబ్బాయి చదువు మధ్యలో వుంది
తెలుగు .. తమిళ భాషల్లో గాయనిగా శైలజకి మంచిపేరు వుంది. ఒకానొక సమయంలో ఈ రెండు భాషల్లో ఆమె పాటలు పాడుతూ బిజీగా ఉండేవారు. ఆ తరువాత చాలా సినిమాల్లో కథానాయికలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. విజయదశమి రోజున ఆమె పుట్టిన రోజు .. ఈ సందర్భంగా 'వనిత' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఇండస్ట్రీతో పాటు మేము చెన్నై నుంచి హైదరాబాద్ కి రాకపోవడానికి కారణం వుంది. అప్పట్లో నేను తెలుగులోను .. తమిళంలోను పాడేదానిని. దీంతో తెలుగులో పాడాలనుకుంటే హైదరాబాదులో ఉండచ్చు, తమిళంలో పాడాలనుకుంటే చెన్నైలో ఉండచ్చు. నాకు సమస్య లేదు. కానీ సుధాకర్ గారికి ఆ సమయంలో తమిళ సీరియల్స్ లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. ఆయన తమిళ సీరియల్స్ వరుసగా చేస్తుండటం వలన .. బాబు చదువు మధ్యలో ఉండటం వలన మేము చెన్నైలోనే ఉండి పోవాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.      
sailaja

More Telugu News