రూ.99 చెల్లిస్తే నోకియా స్మార్ట్ ఫోన్‌ : వినియోగదారులకు కంపెనీ సులభ వాయిదాల అవకాశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.99 చెల్లిస్తే నోకియా స్మార్ట్ ఫోన్‌ : వినియోగదారులకు కంపెనీ సులభ వాయిదాల అవకాశం

  • ఫోన్ల విక్రయదారు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటన
  • మిగిలిన మొత్తానికి నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌
  • నవంబరు 10 వరకు ఆఫర్‌ అందుబాటులో
స్మార్ట్‌ ఫోన్ల తయారీ దిగ్గజం నోకియా తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.99 డౌన్‌ పేమెంట్‌తో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనుక్కునే  అవకాశం ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని ఎటువంటి అదనపు వ్యయం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించుకోవచ్చని ప్రకటించింది. ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ బిగ్‌ షాపింగ్‌ ముగిసి పోవడంతో తాజాగా వినియోగదారులను ఆకట్టుకునే పనిలో నోకియా పడింది.

నోకియా ఫోన్ల విక్రయదారు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ బంపర్‌ ఆఫర్‌ వినియోగించుకోవాలని కోరింది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు దగ్గరలోని రిలయన్స్‌ జియో, జియో డిజిటల్‌ లైఫ్‌, క్రోమా స్టోర్స్‌లో సంప్రదించాలని సూచించారు. నవంబరు 10వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ పేర్కొంది.
nokia offer
smart phone on instalments

More Telugu News