ఆ బలిదానాలు చూడలేకపోయా.. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరా!: తాటికొండ రాజయ్య
- రైతన్నల సంక్షేమం కోసమే ‘రైతు బంధు’
- రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోంది
- జనగామ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్య
తెలంగాణలో గత నాలుగున్నరేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని రాజయ్య అన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్లతో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చామన్నారు. కరుణాపురం అభివృద్ధి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఈసారి లక్ష మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూర్తి సహకారం అందజేస్తున్నారని చెప్పారు.