ఏపీకి ఇవ్వడానికి మేము సిద్ధం.. తీసుకోవడానికే వాళ్లు సిద్ధంగా లేరు: రాజ్నాథ్
- రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత ఉంది
- పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తాం
- ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ
రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత ఉందన్న ఆయన.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కాదని.. ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఏపీ ప్రభుత్వమే తీసుకోవడానికి సిద్ధంగా లేదని రాజ్నాథ్ తెలిపారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై బీజేపీ అధికారంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా రాజ్నాథ్ అభివర్ణించారు.