హత్య కేసులో రాంపాల్ బాబాకు శిక్ష ఖరారు.. జీవితఖైదు విధించిన న్యాయస్థానం
- హరియాణాలోని హిస్సార్ స్థానిక కోర్టు తీర్పు
- మరో హత్య కేసులో శిక్ష రేపు ఖరారు
- 2014లో రాంపాల్ బాబాపై రెండు కేసుల నమోదు
కాగా, హర్యానాలోని బర్వాలా గ్రామంలో రాంపాల్ బాబాకు సత్ లోక్ ఆశ్రమం ఉంది. ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో బాబాకు శిష్యురాళ్లుగా ఉన్న తమ భార్యలు హత్యకు గురయ్యారని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని బద్రపూర్ సమీపంలోని మిఠాపూర్ కు చెందిన శివపాల్, ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ జిల్లా జఖోరా గ్రామానికి చెందిన సురేశ్ లు ఈ ఫిర్యాదులు చేశారు. దీంతో, 2014 నవంబర్ 19న రాంపాల్ బాబా, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి.