టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం

  • తెలంగాణ భవన్ లో ప్రారంభం కానున్న సమావేశం
  • కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించనున్న కేసీఆర్?
  • మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేకే సహా హాజరుకానున్న సభ్యులు
తెలంగాణ భవన్ లో కొద్ది సేపట్లో  టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావు (కేకే) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, సలహాలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్టు సమాచారం. కాగా, కేశవరావు సహా పదిహేను మంది కమిటీ సభ్యులు మీటింగ్ కు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన హామీలను కేసీఆర్ వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పింఛన్ల పెంపు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం, వర్గాల వారీగా కొత్తపథకాలు ప్రకటిస్తారని సమాచారం. 
Go Back to Shorts
TRS
Telangana bhavan
manifesto committee

More Telugu News