పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు ఏపీ, తెలంగాణలో తక్కువే: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
- పనిచేసే ప్రదేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు
- ఏపీ, తెలంగాణలో మెరుగైన వాతావరణం
- గణాంకాలు విడుదల చేసిన కేంద్రం
జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 48 కేసులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది జూలై వరకు ఏపీలో రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, తెలంగాణలో పది కేసులు నమోదయ్యాయి.
లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ 2017లో 570 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూలై నాటికే 533 కేసులు నమోదైనట్టు చెప్పారు. వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడం కోసం ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం ‘షి బాక్స్’ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.