మళ్లీ పెరిగాయి... నేటి 'పెట్రో' ధరల వివరాలు!

  • కొనసాగిన పెట్రో ధరల పెంపు
  • లీటరు పెట్రోలుపై 11 పైసల వడ్డన
  • 23 పైసలు పెరిగిన డీజిల్ ధర
పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం నాడు కూడా పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 11 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.

ఈ పెంపు తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.83కు, డీజిల్ ధర రూ. 75.69కి చేరుకుంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.29, డీజిల్ ధర రూ. 79.35కు పెరిగింది. విజయవాడలో పెట్రోలు రూ. 87.05కు, డీజిల్ రూ. 81.17గా ఉండగా, గుంటూరులో పెట్రోలు ధర రూ. 87.25కు, డీజిల్ ధర రూ. 81.37కు పెరిగింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News