‘తిత్లీ’ బాధితులకు సాయం ప్రకటించిన ‘మెగా’ హీరో వరుణ్ తేజ్
- ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిది
- నా వంతు సాయం చేశా.. ఇక మీ వంతు: వరుణ్ తేజ్
- రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చిన మెగా హీరో
మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిదని, తన వంతు సాయం చేశానని, ఆంధ్రాలోని ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయాలని ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తన ట్వీట్ లో కోరాడు. ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.