ట్విట్టర్‌ను ఊపేస్తున్న మహిళ ఫొటో.. అదేంటో అర్థంకాక తలలు బాదుకుంటున్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్‌ను ఊపేస్తున్న మహిళ ఫొటో.. అదేంటో అర్థంకాక తలలు బాదుకుంటున్న నెటిజన్లు!

  • క్షణాల్లోనే వైరల్ అయిన ఫొటో
  • అదేంటో అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతున్న నెటిజన్లు
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తోంది. రకరకాల ప్రయోగాలు, ఆలోచనలతో ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అటువంటిదే. ట్విట్టర్‌లో ఓ మహిళ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. భ్రాంతి కలిగించే ఈ ఫొటో అసలు రూపం ఏంటో తెలియక నెటిజన్లు పిచ్చెత్తిపోతున్నారు. ఐదు నిమిషాలుపాటు క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు.

@LilMaarty అనే ట్విట్టర్ ఖాతాలో కనిపించిన ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమ్మాయి మెడేనని కొందరు భావిస్తుండగా, మరి మెడ కాకపోతే ఇంకేమి అయి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. దట్టంగా జుట్టు ఉండడంతో చూసిన వెంటనే అది మెడేనన్న భ్రాంతికి లోనవుతున్నారు. అయితే, మరికాస్తా ఏకాగ్రతతో చూస్తే అందులోని మర్మం అర్థం అవుతుంది. ఓ మహిళ తన పొడవాటి రింగులు తిరిగిన జట్టును ఫొటోగ్రాఫర్ సాయంతో ఇలా తీయించుకుని పోస్టు చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ అయింది.

‘‘అసలు ఈ ఫొటో వెనక ఉన్న మర్మమేంటో తెలుసుకునేందుకు నాకు ఐదు నిమిషాలు పట్టింది. తొలుత నేను అమ్మాయి మెడే అనుకున్నాను’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘‘నేనైతే ఓ నిమిషం పాటు ఆ ఫొటో వంక తేరిపారా చూశాను. మరి అది మెడ కాకపోతే మరేమై ఉంటుంది?’’ అని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

శనివారం పోస్టు అయిన ఈ భ్రాంతి కలిగించే ఫొటో ఇప్పటి వరకు 31 వేల సార్లకు పైగా షేర్ అయింది. చాలామంది ఈ ఫొటో వెనక ఉన్న మర్మాన్ని బయటపెట్టేందుకు కుస్తీపడుతున్నారు. అసలా మహిళ అలా ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూ, అందులోని మర్మాన్ని పరిష్కరించాల్సి ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాను ఇంతలా కుదిపేస్తున్న ఈ ఫొటో వెనక ఉన్న మర్మాన్ని పోస్టు చేసిన వాళ్లే చెప్పాలి!
Optical illusion photo
Twitter
Viral
Woman

More Telugu News