త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపించిన జూనియర్ ఎన్టీఆర్
- ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్
- త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన అద్భుత చిత్రమిది
- ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేయాలని, ఆ చిత్రం జీవితాంతం తన గుండె లోతుల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని, ఆ చిత్రాన్ని సమాజానికి, తన పిల్లలకూ చూపించుకోవాలని అనుకున్నానని, అటువంటి చిత్రం ‘అరవింద సమేత’ అని కొనియాడారు.
ఈ సినిమా విజయాన్ని త్రివిక్రమ్ తన ఖాతాలో వేస్తున్నారని, ‘అది తప్పని, ఎందుకంటే, త్రివిక్రమ్ ను తాను నమ్మానని, ఆయన్ని అంతలా నమ్మేలా చేసింది ఆయనే కదా’ అని అన్నారు. త్రివిక్రమ్ కలం నుంచి పుట్టిన ఓ అద్భుతమైన కథ ‘అరవింద సమేత’ అని ప్రశంసలతో ముంచెత్తారు.