లాలూ ప్రసాద్ పార్టీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది: హరీష్ రావు
- ఆర్జేడీపై బీహార్ పార్టీ అనే ముద్రను జార్ఖండ్ ప్రజలు వేశారు
- టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడింది
- ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ యత్నిస్తోంది
నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు చంద్రబాబు పరిస్థితి ఉందని హరీష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వస్తే నాగార్జునసాగర్ పై 45 టీఎంసీల హక్కును తెలంగాణకు కల్పించబడుతుందని బచావత్ ట్రైబ్యునల్ తెలిపిందని... దీనికి కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబును ఆంధ్రా బాబు అంటున్నామని తెలిపారు.