నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు .. నేను నచ్చడం వల్లనే ఓట్లు వేశారు: కౌశల్
- నాకంటూ ఒక ఆర్మీ ఉందనే సంగతే తెలియదు
- బయటికి వచ్చాక నా చుట్టూ ఎంతోమంది వున్నారు
- ఓట్ల విషయంలో ఎలాంటి మతలబు జరగలేదు
అందుకు కౌశల్ స్పందిస్తూ .. "40 కోట్ల ఓట్లు రావడానికి డబ్బులు ఇచ్చానని అంటున్నారు .. నా దగ్గర ఎంత డబ్బు ఉందని మీరు అనుకుంటున్నారు? ఓట్ల విషయంలో ఏదో మతలబు జరిగి ఉంటుందని అంటున్నారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లుగా బయట ఎంతోమంది కనిపిస్తున్నప్పుడు ఎలాంటి మతలబు జరిగే అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకు వాళ్లు నన్ను సపోర్ట్ చేశారంటే, వాళ్లకి నా సహనం .. పట్టుదల .. కసి నచ్చి ఉంటాయి. అంతేగానీ నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. అసలు నాకంటూ ఒక ఆర్మీ ఉందనే విషయం 6వ వారంలో పూజా రామచంద్రన్ గారు హౌస్ లోకి వచ్చినప్పుడు తెలిసింది. దీనిని బట్టీ మీరు అర్థం చేసుకోవచ్చు" అని చెప్పుకొచ్చాడు.