'బిగ్ బాస్ 2' టైటిల్ ను గెలుచుకున్నాను .. లాక్కోలేదు: కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 2' టైటిల్ ను గెలుచుకున్నాను .. లాక్కోలేదు: కౌశల్

  • ఒక జర్నలిస్టుగా ఇది నా అనుమానం 
  • నా ఆట మీకు నచ్చిందా 
  • అయితే టైటిల్ గెలుచుకున్నట్టే    
'బిగ్ బాస్ 2'లో కౌశల్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన అనేక టాస్కులను ఆయన విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక తన వ్యక్తిత్వం వలన కూడా ఆయన ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అలాంటి కౌశల్ తాజాగా టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు.

'బిగ్ బాస్ 2' టైటిల్ ను మీరు గెలుచుకున్నారా? లాక్కున్నారా? అనే ప్రశ్న కౌశల్ కి ఎదురైంది. అందుకు కౌశల్ స్పందిస్తూ .. "మీరేమనుకుంటున్నారు? 'బిగ్ బాస్ 2' ను మొదటి నుంచి ఫాలో అయిన వ్యక్తిగా మీకు నేను టైటిల్ ను గెలుచుకున్నట్టుగా అనిపించిందా? లాక్కున్నట్టు అనిపించిందా? అని కౌశల్ అడిగాడు. 'జాఫర్ గా మీ ఆట నాకు నచ్చింది .. కానీ ఒక జర్నలిస్ట్ గా వున్న అనుమానాన్ని వ్యక్తం చేశాను' అని జర్నలిస్ట్ జాఫర్ అన్నాడు. 'నా ఆట మీకు నచ్చింది కనుక .. 'బిగ్ బాస్ 2' టైటిల్ ను నేను గెలుచుకున్నాననే అనుకోవచ్చు. ఒకవేళ ఆట నచ్చలేదంటే .. లాకున్నానని అనుకోవచ్చు' అని కౌశల్ సమాధానమిచ్చాడు.
kaushal
jaffar

More Telugu News