Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అరవింద' చూశాను .. ఈ మధ్యకాలంలో ఇంతటి ఆనందాన్ని పొందలేదు: సునీల్

  • ఫ్యాక్షన్ కథను ఫ్యామిలీ మూవీ చేశాడు 
  • నన్ను ఓ మంచి పాత్రలో చూపించాడు 
  • త్రివిక్రమ్ కి రుణపడి వుంటాను
హీరోగా చేసినప్పుడు విజయాలు ముఖం చాటేయడంతో .. తనకీ అభిమానులకి మధ్య దూరం పెరిగిపోతుండటంతో, కమెడియన్ గాను చేయడానికి సునీల్ నిర్ణయించుకున్నాడు. అలా ఆయన కమెడియన్ గా చేసిన 'అరవింద సమేత ' నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ .. "ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాను .. తెరపై నన్ను నేను చూసుకుని ఆనందంతో పొంగిపొయాను" అన్నాడు.

"ఓ మంచి పాత్రలో నన్ను నేను ఇలా తెరపై చూసుకోక చాలా కాలమైంది. ఈ మధ్య కాలంలో నేను ఇంతటి ఆనందాన్ని పొందలేదు. ఈ సినిమా చూసినవాళ్లలో చాలామంది 'మీ పాత్ర నిడివి తక్కువగా ఉందేంటని అడుగుతున్నారు. బిర్యానీలో ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి .. లేదంటే తేడా కొట్టేస్తుంది' అని అన్నాడు. ఒక ఫ్యాక్షన్ సినిమాను ఫ్యామిలీ సినిమాగా మార్చడం త్రివిక్రమ్ గొప్పతనం. అలాంటి సినిమాలో ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు నేను రుణపడి వుంటాను" అని చెప్పుకొచ్చాడు.  
sunil

More Telugu News