అసలైన మృగాల పేర్లు ఇంకా బయటకు రాలేదు.. మీటూ ఉద్యమంపై స్పందించిన తాప్సీ!
- బాధితుల మాటలు వింటే భయమేస్తోంది
- బయటకు వచ్చిన వివరాలు అతి స్వల్పమే
- ట్విట్టర్ లో స్పందించిన నటి
అసలు మీ టూ కింద బాధితులు బయటపెడుతున్న పేర్ల కంటే, వాళ్లు ఏ రకంగా లైంగిక వేధింపులకు గురయ్యారో వివరిస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని తాప్సీ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ బాధితులు చెప్పిన వివరాలు అతి స్వల్పమేననీ, మహిళా ఆర్టిస్టులు, నటీమణులను వేధించుకుతినే అసలైన మృగాల పేర్లు ఇంకా బయటకు రాలేదని తనకు అనిపిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు మీ టూ హ్యష్ ట్యాగ్ తో తాప్సీ ఓ ట్వీట్ చేసింది.