షేర్లు అమ్మేసి.. బంగారంపై పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు!
- విలువైన లోహాల ధరలకు రెక్కలు
- ఒక్కరోజులో రూ. 600 పెరిగిన బంగారం ధర
- మరింతగా పెరగనున్న ధరలు
గురువారం ఒక్కరోజే రూ. 600 పెరిగిన స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 31,991కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 415 పెరిగి రూ. 38,900కు పెరిగింది. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఒపెక్ దేశాల నుంచి ముడిచమురు ఉత్పత్తి పెరిగినట్టు వచ్చిన వార్తలతో బ్యారల్ క్రూడాయిల్ ధర రూ. 202 తగ్గి రూ. 5252గా నమోదైంది. క్రితం ముగింపు కంటే ఇది 3.70 శాతం తక్కువ.