ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా తప్పించుకునేందుకే 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారు: ఆర్థిక సంఘం ఛైర్మన్
- విభజన చట్టాల అమలుకు గతంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేది
- అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ బాధ్యత తీసుకునేవారు
- హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు
ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థ లేదని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు తాను కూడా రాజ్యసభలో ఉన్నానని తెలిపారు.