వ్యక్తిగత విమర్శలు చేస్తే గుండుకొట్టిస్తా!: బీజేపీ నేతకు గంగుల హెచ్చరిక

  • నేర చరిత్ర ఉన్న వాడు బండి సంజయ్‌
  • దమ్ముంటే నా మీద ఐటీ రైడ్స్‌ చేయించండి
  • కరీంనగర్‌లో ఈసారి బీజేపీ అడ్రస్‌ గల్లంతు ఖాయం
నేర చరిత్ర ఉన్న బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దిగితే గుండు కొట్టిస్తానని టీఆర్‌ఎస్‌ నాయకుడు గంగుల ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నాది దొంగ వ్యాపారం అని భావిస్తే చేతనైతే ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అని, ఆ పార్టీ చీఫ్‌ జూటా షా అని గడ్కరీనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేది బీజేపీ పార్టీ అని విమర్శించారు.
Go Back to Shorts
BJP
TRS
gangula prabhakar
bandi sanjay

More Telugu News