నెత్తుటి కత్తిని తొడకి తుడవడం కొత్త పద్ధతి .. 'హ్యాట్సాఫ్ త్రివిక్రమ్' అంటున్న ఫ్యాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెత్తుటి కత్తిని తొడకి తుడవడం కొత్త పద్ధతి .. 'హ్యాట్సాఫ్ త్రివిక్రమ్' అంటున్న ఫ్యాన్స్!

  • పాత పద్ధతికి స్వస్తి చెప్పిన త్రివిక్రమ్ 
  • కొత్త స్టైల్ తో కనిపించిన ఎన్టీఆర్ 
  • వన్స్ మోర్ చెబుతోన్న ఆడియన్స్  
గతంలో తెలుగు తెరను చాలా ఫ్యాక్షన్ సినిమాలు పలకరించాయి. సీమ పౌరుషం పేరుతో నాయకులు .. ప్రతినాయకులు తొడగొట్టి మీసం మెలేసిన సన్నివేశాలను అనేక సార్లు ప్రేక్షకులు చూశారు. కానీ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో మాత్రం ఫ్యాక్షన్ ను త్రివిక్రమ్ కొత్త తరహాలో చూపించాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని విరుచుకుపడే తీరు చూసి వన్స్ మోర్ అనేస్తున్నారు.

శత్రువులను నరికేసిన కత్తికి గల నెత్తురును కథానాయకుడు తన తొడకి తుడుస్తాడు. ఈ సీన్ కి ఒక రేంజ్ లో విజిల్స్ పడుతున్నాయి. ఫ్యాక్షన్ సినిమాలలో తొడగొట్టే పాత పద్ధతికి స్వస్తి పలికేసి, నెత్తుటి కత్తిని కసిగా తొడకి తుడవడం డిఫరెంట్ గా ఉందంటూ త్రివిక్రమ్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎన్టీఆర్ కి ఆయన రాసిన పవర్ ఫుల్ డైలాగులకు చప్పట్లు కొట్టేస్తున్నారు. 'గురూజీ ఇంతవరకూ ఈ మాస్ యాంగిల్ ను ఎక్కడ దాచారు?' అంటూ త్రివిక్రమ్ ను ప్రశంసిస్తున్నారు.   
ntr
pooja

More Telugu News