8 ఏళ్ల వయసులోనే వైరముత్తు నన్ను లైంగిక వేధింపులకు గురిచేశారు: గాయని చిన్మయి సంచలన ఆరోపణ
- దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 'మీటూ' ఉద్యమం
- తన భర్త నుంచి మద్దతు లభించబట్టే బయటకు వచ్చానన్న చిన్మయి
- స్విట్జర్లాండ్ లో వైరముత్తు లైంగికంగా వేధించాడని ఆరోపణ
ఇది అమ్మాయిల సమస్య కాదని, లైంగిక వేధింపులకు పాల్పడేవారు భయపడాల్సిందేనని, వారిని చట్టం ముందు నిలపాల్సిందేనని అభిప్రాయపడింది. తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనని వెల్లడించింది. ఘటన జరిగిన తరువాత చాలా సంవత్సరాలకు విషయం బయట పెడుతున్నారని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తనకు ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టే, బయటకు వచ్చానని చెప్పింది. తనకు ఎనిమిదేళ్ల వయసులోనే బ్యాడ్ టచ్ గురించి తెలిసిందని, సింగర్ గా ఎదుగుతున్న క్రమంలో స్విట్జర్లాండ్ కు ఓ ప్రదర్శనకు వెళ్లిన వేళ తనను వైరముత్తు లైంగికంగా వేధించాడని చెప్పింది.