అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేతను కొట్టిచంపిన ప్రత్యర్థులు!

  • ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కేశవరెడ్డి భార్య
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వైసీపీ నేత కేశవరెడ్డిపై కొందరు దుండగులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేశవరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

 కాగా, ఈ దారుణానికి పాల్పడింది పరిటాల సునీత వర్గీయులేనని కేశవరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే పరిటాల వర్గీయులు కేశవరెడ్డిని పొట్టన పెట్టుకున్నారని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశవరెడ్డి భార్య పోలీసులను ఆశ్రయించింది. కేశవరెడ్డి హత్య నేపథ్యంలో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Go Back to Shorts
Anantapur District
atmakur
YSRCP
kesavareddy
murder
paritala sunita
Police

More Telugu News