తెలంగాణ ఎన్నికలకు తొలి జాబితా సిద్ధం చేసిన కాంగ్రెస్‌.. వివరాలు ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఎన్నికలకు తొలి జాబితా సిద్ధం చేసిన కాంగ్రెస్‌.. వివరాలు ఇవిగో!

  • 34 నియోజక వర్గాల నుంచి పోటీ చేసే వారి పేర్లు ఖరారు
  • ఎక్కువ మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే
  • శుక్రవారం జాబితా విడుదలయ్యే అవకాశం
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 34 నియోజకవర్గాలకు పేర్లను ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఉన్నారు. ముందస్తు ఎన్నికలు ముంచుకు వస్తుండడం, తెరాస 105 మంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో కాంగ్రెస్‌ కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో తొందరపడుతోంది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక ఖరారైన వారిలో సబితా ఇంద్రారెడ్డి-మహేశ్వరం, కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్‌, రేవంత్‌రెడ్డి - కొడంగల్‌, గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి, కొండా సురేఖ - పరకాల, పొన్నాల లక్ష్మయ్య - జనగామ, కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌, సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్‌, ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్‌, షబ్బీర్‌ అలీ - కామారెడ్డి, సుదర్శన్‌రెడ్డి - బోదన్‌, శ్రీధర్‌బాబు - మంథని, మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్‌, జీవన్‌రెడ్డి - జగిత్యాల, బలరాంనాయక్‌ - మహబూబాబాద్‌, దొంతు మాధవరెడ్డి - నర్సంపేట, గీతారెడ్డి - జహీరాబాద్‌, దామోదర రాజనర్సింహ - ఆందోల్‌,

జానారెడ్డి - నాగార్జునసాగర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్‌, ఉత్తమ్‌ పద్మావతి - కోదాడ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు, సురేష్‌ షెట్కర్‌ - నారాయణ్‌ఖేడ్‌, రమేష్‌ రాథోడ్‌ - ఖానాపూర్‌, పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌, సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్‌, వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి, డి.కె.అరుణ - గద్వాల, సంపత్‌ - ఆలంపూర్‌, ఆరేపల్లి మోహన్‌ - మానకొండూరు, చిన్నారెడ్డి - వనపర్తి, జగ్గారెడ్డి - సంగారెడ్డి, భట్టి విక్రమార్క - మధిర ఉన్నారు.
Congress
assembly first list

More Telugu News