చెప్పినట్లు బౌలింగ్ చేస్తే రూ.1.48 కోట్లు ఇస్తానన్నాడు!: ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ సంచలన ఆరోపణలు
- ఆత్మకథ ‘నో స్పిన్’లో వెల్లడించిన వార్న్
- పాక్ క్రికెటర్ సలీం మాలిక్ పై ఆరోపణలు
- వైవాహిక జీవితం గురించి ప్రస్తావన
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ ఈ బాగోతానికి తెరతీశాడని వార్న్ తెలిపాడు.1994-95 సీజన్ లో కరాచీలో జరిగిన ఆస్ట్రేలియా-పాక్ టెస్టు సిరీస్ సందర్భంగా మాలిక్ తనతో మాట్లాడాడన్నారు. ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేయాలనీ, అలా చేస్తే 2 లక్షల డాలర్లు(రూ.1.48 కోట్లు) ఇస్తానని సలీం మాలిక్ ఆఫర్ చేశాడన్నారు.

అంతేకాకుండా ఇంకోసారి ఓ బుకీ తనతో బేరం చేసేందుకు యత్నించాడన్నారు. వీటన్నింటినీ తాను తిరస్కరించానని వెల్లడించారు. తన వైవాహిక జీవితంలో జరిగిన ఘటనలను కూడా వార్న్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇద్దరు భార్యలు సిమోన్, ఎలిజబెత్ హార్లీతో విడిపోయినప్పటికీ తామంతా మంచి స్నేహితులమేనని చెప్పాడు. వార్న్ 2005లో వన్డేల నుంచి, 2007లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు.