మత్తుమందిచ్చి రేప్ చేశాడు.. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి వింతా నందా సంచలన ఆరోపణలు!
- అలోక్ నాథ్ కుసంస్కారి
- పార్టీకి వెళితే మత్తుమందు కలిపిన మద్యం తాగించాడు
- తెల్లారేసరికి చాలా నొప్పిగా అనిపించింది
- ఆపై ఎన్నోమార్లు బలాత్కరించాడన్న వింతా నందా
నాటి సాయంత్రం తనకు మత్తుమందిచ్చిన అలోక్ నాథ్, రాత్రి 2 తరువాత ఇంట్లో దింపుతానని చెప్పి, తన కారులో ఎక్కించుకున్నాడని, నాటి అనుభవాన్ని వెల్లడించారు వింతా నందా. ఆ తర్వాత మరింత మద్యం తాగించి, తనపై అత్యాచారం చేశాడని, తెల్లారేసరికి తనకు చాలా నొప్పిగా అనిపించిందని చెప్పింది. తన స్నేహితులకు ఈ విషయం చెబితే, వారు మౌనంగా ఉండమని సలహా ఇచ్చారని వాపోయింది. ఆ తరువాత అలోక్ నాథ్, తనను భయపెట్టి, ఎన్నోమార్లు లైంగికంగా వేధించాడని, తను ఎంతో క్షోభను అనుభవించానని చెప్పింది.