Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నీలియోన్ కు వ్యతిరేకంగా బెంగళూరులో నిరసనలు

  • వీర మహాదేవి పాత్రను పోషిస్తున్న సన్నీలియోన్
  • మహాదేవిని కన్నడిగులు వీరనారిగా కొలుస్తారు
  • నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఈ పాత్రను పోషిస్తుండటంపై కన్నడిగుల ఆగ్రహం
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కన్నడిగులు వీరనారిగా కొలిచే వీర మహాదేవి పాత్రను సన్నీలియోన్ పోషించడమే ఈ ఆగ్రహానికి కారణం.

ఈ సందర్భంగా కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ, 'అమోఘవర్ష నృపతుంగ' కథ ఆధారంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ ఈ పాత్రను పోషించడం దారుణమని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
Sunny Leone
veera mahadevi
amoghavarsha nripatunga
Bollywood

More Telugu News