ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేనికి పుత్ర వియోగం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేనికి పుత్ర వియోగం

  • కెనడాలో మృతి చెందిన కొమ్మినేని కుమారుడు శ్రీహర్ష
  • అతనికి రెండేళ్లుగా కేన్సర్ వ్యాధి
  • మరో పాత్రికేయుడు భోగాది భార్య మృతి
  • సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు పుత్ర వియోగం కలిగింది. కొమ్మినేని ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) రెండు రోజుల కిందట కెనడాలో మృతి చెందారు.రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీహర్ష ఆ దేశంలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీహర్ష ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  కొమ్మినేని దంపతులు కొన్ని రోజుల క్రితమే కెనడా వెళ్లారు. కొమ్మినేని కుమారుడు మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.

ఇదిలా ఉండగా, మరో సీనియర్ పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడు భార్య రైలు ప్రమాదంలో మృతి చెందారు. కొమ్మినేని, భోగాది కుటుంబాల్లో నెలకొన్న విషాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలు చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
kommineni
canda
sri harsha
cancer

More Telugu News