Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తేజస్వి .. బాబు గోగినేని అలా మాట్లాడటం నాకు నచ్చలేదు: కౌశల్

  • తేజస్వికి మర్యాద తెలియదు 
  • లెవెల్ గురించి బాబు గోగినేని మాట్లాడారు 
  • నేను సాధించిన విజయమే నా లెవెల్
'బిగ్ బాస్ హౌస్'లో తన ప్రయాణం .. 113 రోజుల పాటు మిగతా ఇంటి సభ్యుల వలన తనకి ఎదురైన అనుభవాలను గురించి, తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో కౌశల్ ప్రస్తావించాడు. "ఒక రోజున నేను భోజనం చేస్తూ వుండగా తేజస్వి వచ్చి 'సిగ్గులేకుండా తింటున్నాడు' అంది. అంతేకాదు 'యాపిల్ టాస్క్' సమయంలో ఎలాంటి మర్యాద లేకుండా నా గురించి చెడుగా మాట్లాడింది. అందువలన నా దృష్టిలో ఆమె బ్యాడ్ అని చెబుతాను.

ఇక బాబు గోగినేని విషయానికే వస్తే, ప్రతి టాస్క్ లోను ఆయన చీటింగ్ చేశారు. 'కౌశల్ ను బయటికి పంపించాలి .. కౌశల్ తో గొడవపడిన ప్రతి ఒక్కళ్లు బయటికి వెళ్లిపోతున్నారు. ఈ సారి కౌశల్ బయటికి వెళ్లేలా చూడాలి' అని బాబు గోగినేని అనడం నేను బయటికి వచ్చాక చూశాను. 'నా లెవెల్ ఏంటి? కౌశల్ లెవెల్ ఏంటి?' అని కూడా బాబు గోగినేని అన్నారు. నేను సాధించిన విజయమే నా లెవెల్ అనేది నా సమాధానం" అని కౌశల్ చెప్పుకొచ్చాడు.      
kaushal

More Telugu News