Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 2' నుంచి రెండోవారంలోనే బయటికి వచ్చేద్దామనుకున్నాను: కౌశల్

  • ఇంట్లోని వాళ్లంతా ఒక్కటైపోయారు 
  • అంతా నాపై ఎటాక్ చేయడం మొదలుపెట్టారు 
  • అలాంటప్పుడే కౌశల్ ఆర్మీ తయారైందట    
'బిగ్ బాస్ 2'లో పాల్గొన్న కౌశల్ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి విజేతగా నిలిచాడు. అలాంటి కౌశల్ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొని, 'బిగ్ బాస్ హౌస్'లో తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించాడు. 'బిగ్ బాస్ హౌస్'లో ఉండాలంటే ఓర్పు ఉండాలి .. మంచి వ్యక్తిత్వం ఉండాలి. మనం ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకుసాగాలి.

ఇంట్లో వున్న వాళ్లంతా నాపై ఎటాక్ చేస్తూ నన్ను బయటికి పంపించాలనుకున్నప్పుడు, నన్ను సపోర్ట్ చేస్తూ బయట కౌశల్ ఆర్మీ తయారైంది. ఇంట్లోని వాళ్లంతా ఏకమైనప్పుడు రెండవ వారంలోనే నాకు బయటికి వచ్చేయాలని అనిపించింది. బయట హాయిగా ఉండేవాళ్లం .. ఇక్కడికి వచ్చి మాటలు పడవలసిన అవసరం ఏవుంది? అనిపించింది. ఒక సందర్భంలో నూతన్ నాయుడు .. నేను .. మాలో ఎవరో ఒకరు వెళ్లిపోవాలి. అప్పుడు నన్ను పంపించేయమని నానితో చెప్పాను. నాకు బయట ఎంతోమంది అభిమానులు తయారయ్యారనే విషయాన్ని నాని చెప్పడంతో, ఇక వాళ్ల కోసం ఆడాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.   
kaushal

More Telugu News