జపాన్- భారత్ మారిటైం విన్యాసాలు.. విశాఖ తీరానికి జపనీస్ నౌకలు
- విశాఖ చేరుకున్న కగ, ఇనాజుమ
- నేతృత్వం వహించనున్న టట్షుయా పుకడా
- సబ్ మెరైన్‌తో పాటు పి8ఐ హెలికాప్టర్‌లు
భారత్, జపాన్ దేశాల మధ్య పరస్పర సహకారం, యాంటి పైరసీ ఆపరేషన్లలో పరస్పర సమాచార మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి వంటివి ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. భారత్ నుంచి దేశీయంగా రూపుదిద్దుకున్న మూడు యుద్ధ నౌకలతో పాటు, ఒక ఫ్లీట్ ట్యాంకర్ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటుంది. భారత బృందానికి రియర్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 8 రోజుల విన్యాసాలలో నాలుగు రోజులు హార్బర్, మరో నాలుగు రోజులు సముద్రంపైన జరగనున్నాయి.