ఆస్తులు అమ్మేసి 'ఘంటసాల' సినిమా తీశాము: నిర్మాతలు
- తెరపైకి 'ఘంటసాల' జీవితచరిత్ర
- ఈ నెల 13వ తేదీన విడుదల
- మద్దతు ఇవ్వాలంటూ నిర్మాతల విన్నపం
సిహెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అనుమతి తీసుకోకుండా 'ఘంటసాల'గారి జీవితచరిత్రను రూపొందించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘంటసాల తనయుడు రత్నకుమార్ పత్రికాముఖంగా తెలియజేశారు. దాంతో 'ఘంటసాల' సినిమా టీమ్ .. తెలుగు ఫిల్మ్ చాంబర్లో మీడియా ముందుకు వచ్చింది. ఘంటసాలగారి పట్ల అభిమానంతోనే ఈ సినిమా తీశామనీ .. అందుకోసం ఆస్తులు అమ్మేశామని నిర్మాతలు చెప్పారు. ఘంటసాల కుటుంబ సభ్యులు తమకి మద్దతునిస్తూ .. ప్రచారం పరంగా సహకరించాలని కోరారు. మరి ఘంటసాల రత్నకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.