Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సౌందర్య పోషణ గురించి తమన్నా
  • ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గెటప్స్ 
  • రెడీ అవుతున్న మహేశ్ బాబు మల్టీప్లెక్స్!   
*  సౌందర్య పోషణ విషయంలో తాను విపరీతమైన జాగ్రత్తలేమీ తీసుకోనని చెబుతోంది కథానాయిక తమన్నా. 'అందరూ నేనేదో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అనుకుంటారు. అలాంటిదేమీ లేదు. అందరిలానే నేనూ మామూలు జాగ్రత్తలే తీసుకుంటాను. అందం గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ తీసుకోను. ఇది అమ్మానాన్నలు ఇచ్చిన సహజ సౌందర్యం. అందుకే వారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను' అని చెప్పింది.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రముఖ నటుడు ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే, ఇందులో సుమంత్ మొత్తం ఎనిమిది గెటప్స్ లో కనిపిస్తాడట. ఏఎన్నార్ వివిధ సందర్భాలలో ఇలా ఎనిమిది రకాల గెటప్స్ లో ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం.
*  హీరో మహేశ్ బాబు ఇటీవల థియేటర్ బిజినెస్ లోకి ప్రవేశించి మల్టీప్లెక్స్ ల నిర్మాణాన్ని చేబడుతున్నాడు. ఇందులో భాగంగా ఏసియన్ సినిమాస్ తో కలసి తాజాగా హైదరాబాదు గచ్చిబౌలిలో ఐదు థియేటర్ల సముదాయాన్ని నిర్మిస్తున్నాడు. వీటిని దీపావళికి ప్రారంభిస్తారని తెలుస్తోంది.   
Thamanna
NTR
ANR
Mahesh Babu

More Telugu News