'అరవింద'తో త్రివిక్రమ్ కొత్త విషయం చెప్పబోతున్నాడు : పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అరవింద'తో త్రివిక్రమ్ కొత్త విషయం చెప్పబోతున్నాడు : పరుచూరి గోపాలకృష్ణ

  • యూత్ కి నచ్చే ప్రేమకథ 
  • మాస్ మెచ్చే ఫ్యాక్షన్ నేపథ్యం 
  • త్రివిక్రమ్ కత్తికి రెండు వైపులా పదునే
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే .. సగం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు .. సగం కొరటాల శివ గారు తీశారా అనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చిన్న రామయ్య బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఫ్యాక్షన్ విషయాలను .. ప్రేమ అంశాలను అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.

తన కత్తికి రెండు వైపులా పదును ఉందనే విషయాన్ని త్రివిక్రమ్ గారు ఈ సినిమాతో మరోమారు నిరూపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. హింస నుంచి ఒక్కోసారి అహింస పుడుతుంది .. అది శాంతికి కారణమవుతుందనే విషయాన్ని ఈ సినిమాతో త్రివిక్రమ్ చెప్పబోతున్నారు. అందరూ బాగుండాలనే ఒక మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.      
paruchuri

More Telugu News