ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 21 లోక్ సభ సీట్లు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
- సెప్టెంబరులో సర్వే చేసిన సీ ఓటర్
- టీడీపీకి నాలుగు సీట్లు మాత్రమే
- ఓట్ల శాతంలోనూ వైసీపీదే పైచేయి
ఓట్ల విషయంలో వైసీపీకి 41.9 శాతం, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పట్లో టీడీపీకి 15, బీజేపీకి రెండు సీట్లు రాగా, వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. వైసీపీకి 21 సీట్లు వస్తాయన్న తాజా సర్వే ఫలితాలతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.