ఇలియానా 'సెలబ్రిటి' క్రేజ్ అటువంటిది!
- హ్యాకర్లు ఇలియానా పేరును ఎక్కువగా వాడారు
- భద్రతను కూడా పక్కనబెడుతుంటారు
- వినియోగదారులు ఆలోచించాలి
ఈ సందర్భంగా McAfee ప్రతినిధి వెంకట్ కృష్ణాపూర్ మాట్లాడుతూ, ‘‘సెలబ్రిటీలకు, చిత్ర పరిశ్రమకు చెందిన వారికి క్రేజ్ బాగా వుంటుంది. అభిమానులు తమకు ఇష్టమైన వారికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే మాధ్యమాలను కనెక్ట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానులు కొన్నిసార్లు భద్రతను కూడా పక్కన పెట్టి వ్యవహరిస్తుంటారు. దీన్ని సైబర్ నేరస్థులు అవకాశంగా తీసుకుంటారు. తప్పుడు ఐడీలు పెట్టి.. సమాచారం దొంగలించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వినియోగదారులు సినిమాలు, సెలబ్రిటీలు, టీవీ షోలు, ఫొటోలు అని వచ్చే లింక్‌లను క్లిక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి’ అని చెప్పారు.