సీఎం కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్న!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్న!

  • కేసీఆర్ కుటుంబం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడినట్టుంది
  • నన్ను చెల్లెలుగా చూసుకుంటానన్నారు
  • పార్టీ నుంచి మీ రాములమ్మను ఎందుకు సస్పెండ్ చేశావన్నా?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీ-కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి విజయశాంతి సూటి ప్రశ్న వేశారు. అలంపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావం సందర్భంగా ఈరోజు నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. ‘తొమ్మిదో చెల్లెలుగా భావించి కడుపులో పెట్టి చూసుకుంటానన్న కేసీఆర్, పార్టీ నుంచి మీ రాములమ్మను ఎందుకు సస్పెండ్ చేశావు అన్నా?’ అని ప్రశ్నించారు.

ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ను నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారని, ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ నాలుగేళ్లు తానేమీ మాట్లాడలేదని, కానీ, ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుందని, ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నవి సంక్షేమ పథకాలు కాదని..టీఆర్ఎస్ సంపాదన పథకాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
kcr
vijayashanthi
alampur

More Telugu News