Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరణ్ మూవీలో ఛాన్స్ గురించి మాట్లాడిన కౌశల్!

  • నా పాత్ర ఖాయం కాగానే చెబుతాను
  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కాల్ చేశారు 
  • బయటికి వచ్చాక ఎవరూ నాతో మాట్లాడలేదు    
'బిగ్ బాస్ 2'లో పాల్గొన్న దగ్గర నుంచి కౌశల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ కారణంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. చరణ్ హీరోగా బోయపాటి చేస్తోన్న సినిమాలో కౌశల్ తో ఒక ముఖ్యమైన రోల్ చేయించనున్నట్టు టాక్ వచ్చింది. నెగెటివ్ షేడ్స్ తో ఈ పాత్ర ఉంటుందని చెప్పుకున్నారు. ఈ విషయంలో నిజానిజాల గురించి కౌశల్ దగ్గర ప్రస్తావించగా ఆయన స్పందించాడు.

"బోయపాటి - చరణ్ సినిమాలో అవకాశం వచ్చింది. అది ఖరారు కాగానే నేనే స్వయంగా మీకు చెబుతాను. ఒక సింగిల్ కంటెస్టెంట్ కి ఇన్ని ఓట్లు రావడమనేది టీవీ చరిత్రలోనే లేదట. నాకు నిన్ననే 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'వారి నుంచి కాల్ వచ్చింది. కొంత సమయం తీసుకుని అనౌన్స్ చేస్తామని అన్నారు. గిన్నిస్ బుక్ లో చోటు దక్కనుండటం ఆనందంగా వుంది. 'బిగ్ బాస్ హౌస్'లో నాతో పాటు వున్న వాళ్లెవరూ బయటికి వచ్చిన తరువాత మాట్లాడలేదు. హౌస్ లో నాకు వంటచేసి పెట్టారు గనుక, వీలు చూసుకుని వాళ్లకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతాను" అని అన్నాడు.
kaushal

More Telugu News