బాబు గోగినేని నిరూపిస్తే 'బిగ్ బాస్' టైటిల్ ఆయనకే ఇచ్చేస్తా: కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబు గోగినేని నిరూపిస్తే 'బిగ్ బాస్' టైటిల్ ఆయనకే ఇచ్చేస్తా: కౌశల్

  • ఆరోపణలు చేయడం కాదు .. నిరూపించాలి 
  • 40 కోట్ల మందిని మోసం చేయడం సాధ్యమా?
  • కౌశల్ ఆర్మీని కించపరిస్తే ఊరుకునేది లేదు   
'బిగ్ బాస్ 2' హౌస్ లో తొలినాళ్లలో కౌశల్ .. బాబు గోగినేని మంచిగానే వున్నా, ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వలన వాళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కౌశల్ ను బయటికి పంపించిన తరువాతనే తాను బయటికి వెళతానని ఒకానొక దశలో బాబు గోగినేని అన్నారు కూడా. ఇక కౌశల్ టైటిల్ ను గెలుచుకుని వచ్చాక కూడా, మీడియా డిబేట్లలో విమర్శలను సంధించడం బాబు గోగినేని మానుకోలేదు.

కౌశల్ రూల్స్ ను బ్రేక్ చేశాడనీ .. సోషల్  మీడియాను మానిప్యులేట్ చేశాడని ఆరోపించారు. హౌస్ లో నుంచి కొన్ని సంకేతాలు పంపినట్టుగా అనుమానాలున్నాయని అన్నారు. తాజాగా ఈ విషయాన్ని గురించి కౌశల్ స్పందిస్తూ .. "ఆరోపణలు చేయడం కాదు .. ప్రూవ్ చేయాలి. నేను డబ్బులు పంచి గెలిచినట్టుగా బాబు గోగినేని నిరూపిస్తే, బిగ్ బాస్ టైటిల్ ను ఆయన చేతిలో పెట్టేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నాను. 40 కోట్ల మందిని మోసం చేయడం సాధ్యమా .. కాదా అనేది ఆలోచిస్తే సరిపోతుంది. కౌశల్ ఆర్మీని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం నేను సహించబోను' అని చెప్పుకొచ్చాడు.   
kaushal
babu gogineni

More Telugu News