Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న '96'

  • తమిళంలో ఈ రోజే విడుదలైన '96'
  • విజయ్ సేతుపతి జోడీగా త్రిష 
  • దిల్ రాజు చేతికి తెలుగు రీమేక్ రైట్స్ 
విజయ్ సేతుపతి .. త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన '96' తమిళ మూవీ, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1996 నాటి ప్రేమకథా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి వచ్చిన 4 రేటింగ్ .. అక్కడి అనూహ్యమైన స్పందనకు అద్దం పడుతోంది. తమిళనాట యూత్ అంతా కూడా ఈ సినిమాకి నీరాజనాలు పడుతోంది.

ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటని అంటున్నారు. విడుదలకి ముందే ఈ సినిమా చూసిన దిల్ రాజు, ఇది తప్పకుండా హిట్ కొడుతుందని భావించారు. అందువల్లనే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తో తిరిగి వచ్చారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులను ఆయన అప్పుడే ఆరంభించేశారు. కొంతకాలంగా నిర్మాతగా దిల్ రాజు వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నారు. తమిళంలో '96' హిట్ టాక్ తెచ్చుకోవడంతో, తెలుగులో దిల్ రాజు కూడా హిట్ కొట్టనున్నాడని చెప్పుకుంటున్నారు.     
vijay sethupathi
trisha

More Telugu News