కౌశల్ గురించి నాకు ఫోన్ చేసి చాలా మంది బాధపడ్డారు: కౌశల్ తండ్రి సుందరయ్య
- 'బిగ్ బాస్ 2' ప్రతి రోజూ చూశాను
- కౌశల్ పరిస్థితి బాధ కలిగించేది
- గేమ్ అనుకుని సరిపెట్టుకునేవాడిని
ప్రతి రోజు ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాత, నాకు బాగా తెలిసిన ఆర్టిస్టులు .. సన్నిహితులు ఫోన్ చేసేవారు. 'కౌశల్ ని ఒంటరిని చేసి అందరూ ఏడిపించేస్తున్నారు .. చూసేవాళ్లం మనమే తట్టుకోలేకపోతున్నాం .. వాడెలా తట్టుకుంటున్నాడో ఏమో' అని వాళ్లు కన్నీళ్లు పెట్టుకునేవారు. 'వాడు తట్టుకోగలడనే నమ్మకం నాకు వుంది .. మీరేమీ బాధపడకండి. ఎవరెన్ని రకాలుగా చేసినా వాడేం పట్టించుకోడు' అని నేను వాళ్లకి సర్ది చెప్పేవాడిని అని చెప్పుకొచ్చారు.