Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటిపాపే కాటేసింది.. ఐదేళ్లుగా పెంపుడు కుమార్తెపై పెదనాన్న లైంగిక దాడి!

  • భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి చేరిన బాధితురాలు
  • ఇదే అదనుగా ఆమెను లోబర్చుకున్న మృగాడు
  • బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వాస్తవం
నాలుగు నెలల వయసులోనే తల్లి వదిలేసి వెళ్లిపోయిన పసిగుడ్డును ఆమె పెదనాన్న అక్కున చేర్చుకున్నాడు. గోరుముద్దలు తినిపించాడు...భుజాలపైకి ఎక్కించుకుని ఆటలాడించాడు...అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఓ అయ్య చేతిలో పెట్టి ఆమెకో జీవితాన్ని ప్రసాదించాడు. తీరా చూస్తే, అతనే ఇప్పుడు రాక్షసుడిగా మారాడు.

భర్తతో విభేదాల నేపథ్యంలో ఆసరా కోసం తన ఇంటికి వచ్చిన ఆమెపై పెదనాన్నే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఐదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి ప్పాడుతున్నాడు. సభ్య సమాజం విస్తుపోయేలాంటి ఈ వాస్తవం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అనంతపురం జీసస్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. బిడ్డ నాలుగు నెలల వయసులో ఉండగానే ఆమెను కాదనుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయింది.

దీంతో ఆ చిన్నారిని ఆమె పెదనాన్న అక్కున చేర్చుకుని ఆలనాపాలనా చూశాడు. యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లిచేసి మెట్టినింటికి పంపాడు. కొన్నాళ్ల పాటు భర్తతో కాపురం చేసిన బాధితురాలు అతనితో విభేదాలు రావడంతో తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చింది. గడచిన ఐదేళ్లుగా అతనితోనే ఉంటోంది. పెంచిన కుమార్తె అసహాయతను ఆసరాగా తీసుకుని అతను ఆమెను లొంగదీసుకున్నాడు. లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పెదనాన్న చేష్టలు భరించలేని ఆమె చివరికి అనంతపురం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
anantapuram
women raped

More Telugu News