Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయమన్న సింగర్.. రేప్ చేస్తానని బెదిరించిన ఉబెర్ డ్రైవర్!

  • సేఫ్ డ్రైవింగ్ కోసం సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమన్న సింగర్
  • నోరు మూసుకోకుంటే ఇంటికొచ్చి మరీ రేప్ చేస్తానన్న డ్రైవర్
  • పోలీసుల అదుపులో డ్రైవర్
  • క్షమాపణలు చెప్పిన ఉబెర్ యాజమాన్యం
సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయమని చెప్పినందుకు రేప్ చేస్తానంటూ గాయకురాలిని బెదిరించాడో ఉబెర్ డ్రైవర్. కోల్‌కతా సింగర్‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. గాయకురాలు తన పెద్దమ్మతో కలిసి బయటకు వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. కారు నడుస్తుండగా డ్రైవర్ ఫోన్ పలుమార్లు రింగ్ కావడంతో దానిని ఆఫ్ చేయాలని ఆమె కోరింది. దీంతో కోపంతో ఊగిపోయిన డ్రైవర్ నోరు మూసుకుని కూర్చోవాలని, లేదంటే ఇంటికొచ్చి మరీ రేప్ చేస్తానని బెదిరించాడు.

దీంతో కీడు శంకించిన మహిళ ట్రాపిక్ సిగ్నల్ వద్ద క్యాబ్ ఆగగానే అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసుకు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్‌ను సీజ్ చేశారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉబెర్ యాజమాన్యం మహిళకు మద్దతుగా నిలిచింది. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Uber
Driver
Kolkata
Singer
Rape
Police

More Telugu News